News April 11, 2024
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. 2 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Similar News
News February 13, 2026
భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,620 తగ్గి రూ.1,55,780కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పతనమై రూ.1,42,800 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 13, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. UPDATES

*యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
*కాగజ్‌నగర్ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపు
*ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇంద్రేశం (సంగారెడ్డి జిల్లా) 13, 15వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం
*కొల్లాపూర్ 14వ వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) 4, 11, 12 వార్డుల్లో BRS విజయం
*రామాయంపేట పదో వార్డులో BRS గెలుపు


