News September 20, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవనున్నాయి. ఇవాళ APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, ఉ.గో, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. TGలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లుండి వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

Similar News

News September 20, 2024

సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వాలంటీర్ల అసోసియేషన్

image

AP: ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ వాలంటీర్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. 100 రోజులుగా కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలోగా న్యాయం చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

News September 20, 2024

మాల్దీవులకు మళ్లీ సాయం

image

మాల్దీవుల రిక్వెస్ట్ మేరకు మరో $50 మిలియన్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశ ఫైనాన్స్ మినిస్ట్రీ జారీచేసిన టీ-బిల్స్‌ను SBI సబ్‌స్క్రైబ్ చేసుకుంది. దీంతో ఆ నిధులను వాడుకొనేందుకు వీలవుతుంది. మేలో చేసిన సాయానికి ఇది అదనం. ‘మాలెకు ఢిల్లీ చిరకాల మిత్రుడు. బడ్జెటరీ సపోర్టు అందించినందుకు మా ప్రజల తరఫున థాంక్స్’ అని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అన్నారు.

News September 20, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్‌లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT