News January 14, 2025
ALERT.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతిలో ఇవాళ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతితో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది.
Similar News
News October 25, 2025
అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీ ప్రజలు!

దేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. AP తొలి స్థానంలో, తెలంగాణ రెండో ప్లేస్లో ఉన్నట్లు చెప్పింది. 2020-21 లెక్కల ప్రకారం ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నారు. కేరళ(29.9), తమిళనాడు(29.4), కర్ణాటక (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా 3.2%, ఛత్తీస్గఢ్లో 6.5% మంది ఉండటం గమనార్హం.
News October 25, 2025
కీళ్ల నొప్పులు మహిళలకే ఎందుకు ఎక్కువ?

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి జన్యుపరంగానే కాకుండా జీవనశైలి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘రుతుస్రావం, గర్భం, మెనోపాజ్ సమయాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు ఆర్థరైటిస్ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే బరువు పెరగడం, ఇంటి పనులు, శారీరక, మానసిక సమస్యలు కూడా కీళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొంటున్నారు.
News October 25, 2025
ఆర్థరైటిస్ ఎలా నివారించాలి?

మహిళల్లో కీళ్ల నొప్పులను(ఆర్థరైటిస్) నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువు, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు తీసుకోవాలి. అవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలి.


