News September 11, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News November 19, 2025

వంటింటి చిట్కాలు

image

* ఫ్లాస్క్‌ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడగాలి.
* అల్లం, వెల్లుల్లిని రుబ్బేటప్పుడు కొద్దిగా వేయిస్తే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* వంకాయ కూర వండేటప్పుడు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు. రుచి కూడా పెరుగుతుంది.
* కారం డబ్బాలో ఇంగువ వేస్తే పురుగులు పట్టవు.
* పుదీనా, కొత్తమీర చట్నీ చేసేటప్పుడు పెరుగు వేస్తే రుచి పెరుగుతుంది.

News November 19, 2025

362 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTSపోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 నుంచి DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.mha.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 19, 2025

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>పవర్‌గ్రిడ్ <<>>కార్పొరేషన్‌లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.