News September 18, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News September 15, 2025
మానసిక సమస్యలు రాకూడదంటే?

ప్రస్తుతం చాలా మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నివారణకు సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాలను మానసిక వైద్యుడు శ్రీకాంత్ పంచుకున్నారు. ‘ఆనందమైన బాల్యం, పేదరికం లేకపోవడం (ధనికులుగా ఉండటం కాదు), దీర్ఘకాలిక స్నేహం, వ్యాయామం, పెళ్లి, భక్తి/ దేవుని పట్ల నమ్మకం, సామాజిక సేవ, సైన్యం లేదా NCC వంటి వాటిలో చేరటం. సమతుల్య ఆహారం, పచ్చదనం, అభిరుచులు (హాబీస్)’ వంటివి ఉండాలని సూచించారు.
News September 15, 2025
అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి: ఓంబిర్లా

AP: మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత భారత్ సాధించలేమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. తిరుపతి మహిళా సాధికార సదస్సులో రెండోరోజు మాట్లాడారు. ‘భద్రత, ఆత్మనిర్భరత ప్రతి మహిళకు అందాలి. స్త్రీలను అన్నిరంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా చర్చించాం. పంచాయతీ స్థాయిలో కంప్యూటర్ సెంటర్ ఉండేలా చూడాలి. అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిటీలు ఏర్పాటు చేయాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది PM కల’ అని తెలిపారు.
News September 15, 2025
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఏమందంటే?

* <<17714335>>వక్ఫ్<<>> భూముల ఆక్రమణపై కలెక్టర్‌దే తుది నిర్ణయమన్న ప్రొవిజన్‌పై SC స్టే విధించింది. ట్రిబ్యునల్/కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలంది.
* సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరుల సంఖ్య 4, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో 3కు మించొద్దని చెప్పింది.
* స్టేట్ బోర్డుకు నాన్-ముస్లిం CEO కావొచ్చన్న ప్రొవిజన్‌పై స్టే విధించలేదు. కానీ వీలైనంత వరకు ముస్లింనే నియమించాలంది.
* రిజిస్ట్రేషన్ రూల్‌లో కోర్టు జోక్యం చేసుకోలేదు.