News November 3, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Similar News
News November 16, 2025
iBOMMA, BAPPAM సైట్లు బ్లాక్

iBOMMA, BAPPAM సైట్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ అవ్వడం లేదు. iBOMMA సైట్లో 1XBet అనే <<18296786>>బెట్టింగ్<<>>, ఆన్లైన్ గేమింగ్ యాప్ను నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించడం అతడి ప్లాన్ అని, ఇందుకోసం బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
నేను 2 గంటలే నిద్రపోతా: జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రోజూ రాత్రి కేవలం 2 గంటలు, మహా అయితే 4 గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. ఈ అలవాటు తన స్కిన్కు చేటు చేస్తుందని అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం అధికారులతో 3am వరకు మీటింగ్ పెట్టడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. జపాన్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<


