News November 30, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రానున్న 4 రోజులు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Similar News

News December 13, 2025

హైదరాబాద్ దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

హైదరాబాద్ <>దూరదర్శన్<<>> కేంద్రంలో 11 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్, బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. న్యూస్ రీడర్లకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 13, 2025

భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

image

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్‌ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.

News December 13, 2025

ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

image

<>ప్రసార భారతి<<>>, న్యూఢిల్లీ 16 కాస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. CMA ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 17వరకు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాస్ట్ ట్రైనీలకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి సంవత్సరం పాటు రూ.15,000, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in