News May 31, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అటు ఇవాళ పల్నాడు(D) వినుకొండలో 45.9 డిగ్రీలు, ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4, NTR(D) నందిగామలో 45.3, GNT(D) తుళ్లూరు, ఫిరంగిపురంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 19, 2026

ఉగాదికి DSC నోటిఫికేషన్!

image

AP: మరో డీఎస్సీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఆదర్శ స్కూళ్లు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్లు, సంక్షేమ శాఖ పాఠశాలల్లో మొత్తంగా 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సిలబస్‌‌లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన సిలబస్‌నే కొనసాగించే అవకాశం ఉంది.

News February 19, 2026

మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!

image

TG: ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రతి మహిళకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు RTC సిద్ధమైంది. వచ్చే నెల నుంచి వీటిని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ బేస్డ్ కార్డులను టికెట్ మెషీన్‌పై ట్యాప్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుందని అధికారులు తెలిపారు. తొలుత జిల్లాకొక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా కార్డులు జారీ చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని సమాచారం.

News February 19, 2026

ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని CSIR-IICT 16పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PhD, MTech, మెటీరియల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), BTech/BE, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 35ఏళ్లు. సైట్: www.iict.res.in