News June 12, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో రేపు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News December 24, 2024
నేటి ముఖ్యాంశాలు
* దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
* బీసీలకు 34శాతం రిజర్వేషన్లు: చంద్రబాబు
* తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేత
* TG: వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి
* అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలి: MLC
* అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్
News December 24, 2024
అశ్విన్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్
ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్, అన్క్యాప్డ్ ప్లేయర్ తనుష్ కోఠియన్ను BCCI అనూహ్యంగా ఎంపిక చేసింది. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆయన జట్టులో చేరనున్నట్లు తెలిపింది. ఈ ముంబై ఆల్రౌండర్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 101 వికెట్లు తీశారు. బ్యాటింగ్లో 1,521 పరుగులు చేశారు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.
News December 24, 2024
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
AP: సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు తత్కాల్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్ణీత రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. పలు కారణాలతో చెల్లించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.