News June 29, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.

Similar News

News October 22, 2025

లిక్కర్ షాపులకు అప్లికేషన్లు.. లక్షకు చేరుతాయా?

image

TG: రాష్ట్రంలో లిక్కర్ షాపులకు దరఖాస్తులు లక్షకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 89,805 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రంగారెడ్డి(D)లో అత్యధికంగా 27వేలు, ఆదిలాబాద్(D)లో అత్యల్పంగా 3,894 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. రేపటి వరకు అవకాశం ఉండటంతో లక్షకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. 2,620 లిక్కర్​ షాపులకుగానూ వచ్చిన అప్లికేషన్లతో దాదాపు రూ.2,700 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.

News October 22, 2025

కర్మ ఫలం ఎంత విచిత్రమైనదో!

image

తనకు పుట్టిన పసిబిడ్డ కర్ణుడిని లోక నిందకు భయపడి కుంతీ దేవి నదిలో వదిలివేసింది. ఆ పసిబిడ్డ లోకాన్ని ఏలేంత వీరుడై, తన కన్నతల్లికే కంటకుడయ్యాడు. చివరికి ఆ కుంతీ దేవియే కన్న ప్రేమతో తన ఐదుగురు కుమారుల(పాండవుల) ప్రాణాలను కాపాడమని, తాను నదిలో వదిలేసిన బిడ్డనే బతిమాలాల్సి వచ్చింది. చేసిన కర్మ ఫలితం ఏదో ఒక రూపంలో అనుభవించక తప్పదని ఈ ఘట్టం రుజువు చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆయన పాండవులను చంపడు.

News October 22, 2025

ఛోక్సీ కోసం ఆర్థర్ రోడ్ జైలు సిద్ధం!

image

ఆర్థిక నేరస్థుడు మెహుల్ <<18037252>>ఛోక్సీ<<>> కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిద్ధమైంది. బ్యారక్ నం-12లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇందులో 2 రూములు ఉండగా అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను అధికారులు బెల్జియం ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. త్వరలోనే ఛోక్సీని భారత్‌కు బెల్జియం అప్పగించే అవకాశం ఉంది. ఇక అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్థర్ రోడ్ జైలులోనే గతంలో 26/11 నిందితుడు అజ్మల్ కసబ్‌ను ఉంచారు.