News July 27, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Similar News
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

<
News November 28, 2025
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన ఢాకా కోర్టు ఏడేళ్ల చొప్పున మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఒక్కో కేసులో రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేకుంటే మరో 18 నెలలు జైలు శిక్ష పొడిగిస్తామని తీర్పునిచ్చింది. హసీనా కూతురు, కుమారుడిపై నమోదైన కేసుల్లో కోర్టు వారిద్దరికీ 5ఏళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కో లక్ష ఫైన్ కట్టాలని తీర్పునిచ్చింది.


