News August 14, 2024
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రేపు రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో , ప.గో , ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, YSR, చిత్తూరులో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.
Similar News
News November 15, 2025
బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 15, 2025
ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<


