News April 22, 2025
ALERT: నేడు, రేపు వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఎండలు కూడా ముదురుతున్నాయి. ఆదిలాబాద్‌లో నిన్న సాధారణం కన్నా 2.9 డిగ్రీలు పెరిగి 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలాచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 2 రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News August 8, 2025
HYDలో వర్షాలు.. అత్యవసర హెల్ప్‌లైన్లు ఇవే

హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రోడ్లను వరద ముంచెత్తుతోంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. వర్షం, వరద సమయంలో ఏదైనా సాయం అవసరమైతే సంప్రదించాలని సూచిస్తూ అధికారులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించారు. పైనున్న ఫొటోలో వివరాలు ఉన్నాయి.
News August 8, 2025
EP30: ఇలా చేస్తే శత్రువులు కూడా ప్రశంసిస్తారు: చాణక్య నీతి

తెలివి, జ్ఞానం ఉన్న వారికి అన్ని చోట్ల గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. ‘జీవితంలో ప్రతి దశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. నిజాయితీగా, సంస్కారవంతంగా ఉంటే ఎవరూ మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. చేసే ప్రతీ పనిని ప్రేమించాలి. గొప్ప నైపుణ్యాలు ప్రదర్శిస్తే సంబంధిత రంగాల్లో గౌరవం, డబ్బు లభిస్తాయి. నైపుణ్యాలు చూసి శత్రువులూ ప్రశంసిస్తారు’ అని బోధిస్తోంది.
News August 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో P4 కార్యక్రమంపై చర్చించిన CM చంద్రబాబు.. రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వంతో కలిసి రావాలని పిలుపు
☛ సెలూన్లకు ఉచిత విద్యుత్ పరిమితి 150 నుంచి 200 యూనిట్లకు పెంపు
☛ ఈనెల 9న అల్లూరి జిల్లా పాడేరుకు CM చంద్రబాబు
☛ రెవెన్యూ భూముల ఆరోపణలపై విచారణ జరిపించాలని CM చంద్రబాబుకు బొత్స లేఖ