News April 6, 2025

ALERT: రేపు, ఎల్లుండి వర్షాలు

image

TG: ద్రోణి కారణంగా వచ్చే 2రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో రేపు.. వీటితో పాటు సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Similar News

News April 7, 2025

ప్రధాని వ్యాఖ్యలకు చిదంబరం కౌంటర్

image

తమిళనాడుకు UPA ప్రభుత్వం కంటే అధిక నిధులిచ్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఎకానమీ, మ్యాట్రిక్స్ గతంతో పోల్చితే ఎప్పుడూ అధికంగానే ఉంటాయని, ఈ విషయం ఫస్టియర్ ఎకానమీ, స్టూడెంట్‌ను అడిగినా చెబుతారన్నారు. ప్రతి ఏడాది జీడీపీ పెరిగినట్లే బడ్జెట్ పెరుగుతుందన్నారు. మీ వయసు గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఏడాది పెరుగుతుంది కదా అని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

News April 7, 2025

BREAKING: గుజరాత్ ఘన విజయం

image

IPL2025: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH 152/8 స్కోర్ చేయగా, GT 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సుదర్శన్ 5, గిల్ 61*, బట్లర్ 0, సుందర్ 49, రూథర్‌ఫర్డ్ 35* పరుగులు చేశారు. షమీ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. అన్ని విభాగాల్లోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.

News April 7, 2025

ALERT.. రేపు, ఎల్లుండి వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 10 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు రానున్న మూడ్రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.

error: Content is protected !!