News April 7, 2025
ALERT.. రేపు, ఎల్లుండి వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 10 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు రానున్న మూడ్రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.
Similar News
News January 1, 2026
వేములవాడ: మంత్రికి ప్రసాదం అందజేసిన ఎమ్మెల్యే

రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శ్రీస్వామి వారి ప్రసాదం అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయం పక్షాన శ్రీ స్వామివారి ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు.
News January 1, 2026
విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

AP: న్యూఇయర్ వేళ నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)కు విషమిచ్చి సురేందర్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను పెంచే స్తోమత లేక సురేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
News January 1, 2026
పండగకు, జాతరకు స్పెషల్ బస్సులు.. ఛార్జీల పెంపు!

TG: సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర పెంపు ఉంటాయన్నారు.


