News April 13, 2024

ALERT: తీవ్రమైన వడగాల్పులు

image

AP: రేపు 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఉ.11-సా4గంటల వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరింది. గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, ఇంట్లో చేసిన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని పేర్కొంది. మీ మండలం ఉందో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి చూడండి.

Similar News

News March 19, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: వచ్చే రెండు గంటల్లో (4.30PM వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News March 19, 2026

‘ధురంధర్’ డైరెక్టర్ గురించి తెలుసా?

image

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఇతడు కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవారు. 1983లో ఢిల్లీలో జన్మించారు. క్రికెటర్ కావాలని కలలు కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వదిలేశారు. ముంబైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే సినిమాతో సంచలనం సృష్టించారు. 2021లో హీరోయిన్ యామీ గౌతమ్‌ను పెళ్లి చేసుకోగా 2024లో కుమారుడు జన్మించాడు.

News March 19, 2026

ఖతర్‌పై దాడితో భారత్‌‌కు మరిన్ని కష్టాలు!

image

ఖతర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్‌‌ <<19422796>>రాస్ లఫన్‌<<>>పై ఇరాన్ చేసిన దాడి భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియా 50% LNGని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. దీంట్లో 40% వాటా ఖతర్‌దే. దీంతో భారత్‌లో పారిశ్రామిక, విద్యుదుత్పత్తి రంగాల్లో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే నేచురల్ గ్యాస్ దిగుమతులు తగ్గాయి. తాజా దాడితో సమస్య మరింత తీవ్రం కానుంది.