News September 9, 2025
ALERT: ఇక ఎగ్జామ్ పేపర్స్ షేర్ చేస్తే జైలుకే!

అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. SM, ఆన్‌లైన్లో ఎగ్జామ్ పేపర్స్‌పై చర్చించడం, షేర్ చేయడం నేరమని తెలిపింది. ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అవకతవకలు నివారించడానికి కేంద్రం ఇటీవల పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జైలు శిక్ష, భారీ ఫైన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని SSC హెచ్చరించింది.
Similar News
News March 5, 2026
రేపటి నుంచి భగభగలు!

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 5, 2026
యుద్ధంపై బెట్టింగ్.. ₹కోట్లు గెలుచుకున్నారు!

US-ఇరాన్ యుద్ధంతో ఓ పక్క ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం కాసులపంట పండించుకున్నారు. ఇరాన్‌పై US ఎప్పుడు దాడి చేస్తుందో అంచనా వేసి పాలీమార్కెట్ అనే క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో గత శుక్రవారం 150 మంది బెట్ కాశారు. వీరిలో 16 మంది లక్ష డాలర్లు, ఓ వ్యక్తి 5లక్షల డాలర్లు (₹4కోట్లు) సంపాదించారు. అయితే యుద్ధంపైన బెట్టింగ్ ఏంటని పాలీమార్కెట్ సహా యూజర్లపై విమర్శలు వస్తున్నాయి.
News March 5, 2026
విశాఖ భూగర్భంలో రెడీగా మిలియన్ టన్నుల చమురు!

మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నేపథ్యంలో మన దేశంలో ముడి చమురు నిల్వల సామర్థ్యం చర్చనీయాంశమైంది. అయితే ఇంధన సంస్థల నిల్వలతో పాటు విశాఖ, కర్ణాటకలోని మంగళూరు, పడూరులో అండర్‌గ్రౌండ్‌లో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు భద్రంగా ఉందని తెలుసా? వీటినే స్ట్రాటజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ అంటారు. 2015లో ఫేజ్-1 లాంచ్ కాగా మరిన్ని ఏర్పాటుకానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉండేందుకు వీటిని తీసుకొచ్చారు.


