News September 8, 2025

ALERT: అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ మొబైల్ కొంటున్నారా?

image

ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మొబైల్స్, యాక్సెసరీస్, ట్యాబ్స్ కొనుగోలు చేసేవారికి ‘శామ్‌సంగ్’ పలు సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో రీఫర్బిష్డ్, ఫేక్ వస్తువులు కొనకుండా యూజర్లను అలర్ట్ చేసింది. అమెజాన్‌లో Clicktech Retail, STPL Exclusive, Darshital Etel సెల్లర్స్ నుంచి మాత్రమే కొనాలంది. ఫ్లిప్‌కార్ట్‌లో TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerceలో తీసుకోవాలంది.

Similar News

News September 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.

News September 8, 2025

మూసీని ప్రక్షాళన చేయొద్దా: రేవంత్

image

TG: గంగా, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు కానీ తాము మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని సీఎం <<17649892>>రేవంత్<<>> రెడ్డి ప్రశ్నించారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. ఇందుకు అందరూ కలిసి రావాలని కోరుతున్నా. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది’ అని స్పష్టం చేశారు.

News September 8, 2025

ఈ సూపర్ కాప్ గురించి తెలుసా?

image

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్‌ను రెండు సార్లు పట్టుకున్న ముంబై లెజెండరీ పోలీస్ మధుకర్ బాపూరావు జెండే గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తన తెలివితేటలు, ధైర్యం, ఓపికతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించడం విశేషం. దీంతో ఆనాటి పీఎం రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జెండేను ప్రశంసించారు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ సినిమా ఈనెల 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.