News September 3, 2024
ALERT.. కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జనగామ, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News October 24, 2025
బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.
News October 24, 2025
రేపే నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే?

పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే.. జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి నాగ దేవత అనుగ్రహంతో తగిన జీవిత భాగస్వామి లభిస్తారని పేర్కొంటున్నారు. ☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.
News October 24, 2025
340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


