News September 5, 2024

ALERT.. కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, గద్వాల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, భువనగిరి, నల్గొండ, సంగారెడ్డిలో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి.

Similar News

News November 27, 2025

సారంగాపూర్: ‘ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి’

image

సారంగాపూర్ మండలం కోనాపూర్, అర్పపల్లి, ధర్మానాయక్ తండా, రంగపేట, నాగునూర్, లచ్చక్కపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు వేగంగా చేయాలని ఆదేశించారు. 17% తేమ ఉన్నా సన్న, దొడ్డు రకాలు తప్పనిసరిగా కొనాలన్నారు.

News November 27, 2025

పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

image

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.