News January 31, 2025

ఈ సిరప్‌ వాడుతున్నారా?

image

దగ్గు నుంచి ఉపశమనం కలిగించే సిరప్‌లపై అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక ప్రకటన చేసింది. ఫినైలెఫ్రిన్ అనే పదార్థం ఉన్న దగ్గు సిరప్‌ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది. 2023లోనే దీనిపై జరిగిన క్లినికల్ ట్రయల్స్‌లో గుర్తించినప్పటికీ అమెరికాలోనే రూ.14,000 కోట్ల విలువైన ఈ మందులు అమ్ముడవుతున్నాయి. ఇండియాలోనూ చాలా దగ్గు సిరప్‌లలో ఫినైలెఫ్రిన్ ఉందని వైద్యులు చెబుతున్నారు. SHARE IT

Similar News

News September 16, 2025

యువరాజ్, ఉతప్ప, సోనూసూద్‌లకు ED సమన్లు

image

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌లకు ED సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(1xBet)కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమీ చక్రవర్తిలను ED విచారించింది. కాగా 1xBet యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి ఊర్వశీ రౌతేలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది.

News September 16, 2025

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య‌పై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.

News September 16, 2025

పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

image

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.