News July 19, 2024
ALERT: ఆ 2 పరీక్షలు రద్దు

TG: పేపర్ లీక్ కారణంగా 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (EO) పోస్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు TGPSC ప్రకటించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ, సిట్ నివేదికల ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను క్యాన్సిల్ చేస్తున్నామని తెలిపింది. త్వరలో కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వెబ్ నోట్ విడుదల చేసింది.
Similar News
News November 27, 2025
రుద్రవరంలో యాక్సిడెంట్.. 150 బస్తాల ధాన్యం నేలపాలు

రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్కు గాయాలయ్యాయి.
News November 27, 2025
అమరావతిలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ

AP: అమరావతి కృష్ణానది తీరంలో శ్రీవేంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2 దశల్లో ₹260Cr వెచ్చించనుంది. ఈ పనులకు CM CBN ఇవాళ భూమి పూజ చేయనున్నారు. దాదాపు 3వేల మంది భక్తులు పాల్గొని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాకారం, ఏడంతస్తుల రాజగోపురం, సేవా మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, విశ్రాంతి భవనం తదితర పనులు పూర్తిచేస్తారు.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.


