News April 5, 2025
ALERT: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఎండలు కాస్తాయని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నెలకొంటుందని పేర్కొంది. TGలోని ఉమ్మడి MBNR, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News April 5, 2025
వృద్ధి రేటులో తమిళనాడు ఫస్ట్, ఏపీ సెకండ్

2024-25కి గాను ఆర్థిక వృద్ధి రేటులో ఏపీ 8.21 శాతంతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధితో తమిళనాడు తొలిస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత రాజస్థాన్- 7.82%, హరియాణా- 7.55%, కర్ణాటక- 7.37%, మహారాష్ట్ర- 7.27%, తెలంగాణ- 6.79% ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది.
News April 5, 2025
రిటైర్డ్ హర్ట్.. రిటైర్డ్ ఔట్ తేడాలివే?

క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ పదాలు ఒకేలా ఉన్నా వీటి మధ్య కాస్త తేడా ఉంటుంది. రిటైర్డ్ హర్ట్ అనగా బ్యాటర్ గాయంతో లేదా ఏదైనా ఇతర సమస్యతో మైదానాన్ని వీడుతారు. తిరిగి క్రీజులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అనగా ఇతర కారణాలతో ఇన్నింగ్సును కొనసాగించకుండా గ్రౌండ్‌ను వీడుతారు. తిరిగి క్రీజులోకి రావాలంటే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అనుమతి అవసరం. నిన్న <<15996543>>తిలక్ రిటైర్డ్ ఔట్‌గా<<>> గ్రౌండ్ వీడారు.
News April 5, 2025
పీరియడ్స్ వల్ల పూజకు ఆటంకం.. మహిళ ఆత్మహత్య

UPలోని ఝాన్సీలో ప్రియాంశ సోనీ(36) అనే మహిళ నవరాత్రి పూజకు ముందు పీరియడ్స్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఛైత్ర నవరాత్రి పూజకు ముందు రోజు ఆమె కావాల్సిన సామగ్రి తెప్పించుకున్నారు. కానీ పీరియడ్స్ రావడంతో పూజ చేసుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి సూసైడ్‌కు పాల్పడ్డారు. పీరియడ్స్ అనేది ప్రతి నెలా సహజంగా జరిగేదేనని తాను నచ్చజెప్పినా సోనీ ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త తెలిపారు.