News May 2, 2024
బ్యాంక్ రుణగ్రహీతలకు అలర్ట్

రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు రుణగ్రహీతలను 4 అంశాల్లో భారీగా మోసం చేస్తున్నాయి. 1.రుణం అందిన రోజు కాకుండా అనుమతి పొందిన రోజు నుంచే వడ్డీ వసూలు చేయడం, 2. చెక్ డబ్బు జమ అయినప్పటి నుంచి కాకుండా, ఇష్యూ తేదీ నుంచి వసూలు చేయడం, 3. రుణం చెల్లించే తేదీ కాకుండా, మొత్తం నెలకు వడ్డీ వసూలు చేయడం, 4. కొన్నిసార్లు ఒక వాయిదా సొమ్ము అడ్వాన్స్‌గా తీసుకుంటున్నాయి. దీంతో ఇటీవల RBI కీలక <<13149063>>ఆదేశాలు<<>> ఇచ్చింది.
Similar News
News April 1, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెరిగిన వార్డులు.. వివరాలు ఇవే.!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 పురపాలక సంఘాల్లో వార్డులు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చీరాల 33 నుంచి 44, మార్కాపురం 35 నుంచి 40, కనిగిరి 28 నుంచి 32, అద్దంకి 27 నుంచి 32, చీమకుర్తి 27 నుంచి 28, దర్శి 27 నుంచి 28, గిద్దలూరు 27 నుంచి 28 వార్డులను పెంచారు. వార్డుల్లో పెరిగిన ఓటర్ల దృష్ట్యా ఆయా మున్సిపాలిటీల కమిషనర్ల సూచనల మేరకు వార్డులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 1, 2026
అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి

ఇరాన్ అన్నంత పని చేసింది. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై క్షిపణులతో దాడి చేసింది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 18 టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ <<19529158>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఇవన్నీ తమపై దాడులకు సహకరిస్తున్నాయని టెహ్రాన్ మండిపడుతోంది.
News April 1, 2026
ఢిల్లీ బౌలర్లు భళా.. లక్నో స్కోర్ ఎంతంటే?

IPL: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. మార్ష్ 35, పంత్ 7, మార్క్రమ్ 11, పూరన్ 8, అబ్దుల్ సమద్ 36, ముకుల్ 14, షహబాజ్ అహ్మద్ 15* రన్స్ చేశారు. నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లతో లక్నో బ్యాటర్లను బోల్తా కొట్టించారు.


