News July 16, 2024
SBI కస్టమర్లకు అలర్ట్

స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన ‘అమృత్ వృష్టి’ FD పథకంలో 7.25% వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. 2025 మార్చి 31 వరకు ఈ స్కీం అందుబాటులో ఉండనుంది. SBIలోని ఇతర FD పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ వచ్చే స్కీం ఇదే. SBI శాఖలు, యోనో SBI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దీనిలో FD చేయవచ్చు. అటు 400 రోజులకు ‘అమృత్ కలశ్’ పేరిట అందించే పథకంలో 7.10% వడ్డీ లభిస్తోంది.
Similar News
News December 4, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ‘క్లిక్కర్’ విధానం

AP: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పాఠాల రివిజన్‌కు ప్రభుత్వం ‘క్లిక్కర్’ విధానాన్ని తీసుకురానుంది. లెసన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు క్లిక్కర్ ఇస్తారు. అందులో A, B, C, D, యెస్, నో, హ్యాండ్ రైజ్ ఆప్షన్లు ఉంటాయి. క్లాస్ రూమ్‌లోని డిజిటల్ బోర్డులో ప్రశ్న డిస్ప్లే అవుతుంది. దానికి క్లిక్కర్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధానాన్ని రేపు తొలిదశలో 53 స్కూళ్లలో CM చంద్రబాబు ప్రారంభించనున్నారు.
News December 4, 2025
విచారణ ఇంత జాప్యమా… వ్యవస్థకే సిగ్గుచేటు: SC

యాసిడ్ దాడి కేసుల విచారణ డేటాను సమర్పించాలని అన్ని హైకోర్టులను SC ఆదేశించింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్ల నాటి ఓ కేసు విచారణ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై CJI సూర్యకాంత్ అసంతృప్తి వ్యక్తపరుస్తూ ఇది వ్యవస్థకే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 2009లో యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి తన ఆవేదనను SCకి వినిపించారు. ముఖంపై యాసిడ్ దాడితో వైకల్యంతో పాటు దాన్ని తాగించిన ఘటనల్లో పలువురు ఆహారాన్నీ తీసుకోలేకపోతున్నారన్నారు.
News December 4, 2025
తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్

AP: TDP ఆధిపత్యపోరులో జరిగిన హత్య ఘటనలో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేశారని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. హతులు, హంతకులు TDP వాళ్లేనని స్వయంగా SPయే చెప్పారన్నారు. ఇవే కాకుండా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ‘ఎక్కడైనా న్యాయం ఉందా? తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది’ అని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌పై CBN గతంలో ఒకలా మాట్లాడి ఇపుడు కార్మికుల్ని బెదిరిస్తున్నారని విమర్శించారు.


