News November 14, 2024
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్
AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
Similar News
News November 14, 2024
‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల కానుంది. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ కానుంది.
News November 14, 2024
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటాం: రోజా
AP: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని YCP నేత ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ‘రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారు. మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం’ అని ఆమె ట్వీట్ చేశారు.
News November 14, 2024
ఎడమ కంటికి సమస్య.. కుడి కంటికి ఆపరేషన్ చేశారు
UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.