News April 29, 2024
బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు అలర్ట్

TG: తెలంగాణ EAPCET-2024 (గతంలో ఎంసెట్) హాల్టికెట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు చెందిన అగ్రికల్చర్, ఫార్మా హాల్టికెట్లను eapcet.tsche.ac.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 1 నుంచి ఇంజినీరింగ్ హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఎంట్రన్స్ టెస్టు రాసేందుకు రూ.5000 లేట్ ఫీజుతో మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 7, 8, 9, 10, 11 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
Similar News
News December 18, 2025
కాల సర్ప దోష నివారణ మార్గాలు

రోజూ శివుడిని పూజించడం, సోమవారం శివలింగానికి పాలతో అభిషేకించడం వల్ల కాల సర్ప దోష ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ‘శనివారం శనీశ్వరుడికి నల్ల నువ్వులు సమర్పించి 7 ప్రదక్షిణలు చేయాలి. నాగపంచమి రోజున గుడిలో నాగుల జంట ప్రతిమను దర్శించాలి. మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. నాగ ఉంగరాన్ని ధరించాలి. ఫలితంగా దోష ప్రభావం తగ్గుతుంది’ అని సూచిస్తున్నారు.
News December 18, 2025
రైల్వేలో 311 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

RRB 311 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసోలేటెడ్ కేటగిరీలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సీబీటీ 1, 2, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్సైట్: www.rrbcdg.gov.in/
News December 18, 2025
చలికాలంలో కోడి పిల్లల మరణాలు తగ్గాలంటే..

చలికాలంలో కోడి పిల్లల మరణాలు తగ్గాలంటే బ్రూడింగ్ ముఖ్యం. దీని కోసం 200 వాట్ల విద్యుత్ బల్బులను 100 కోడి పిల్లలకు ఒకటి చొప్పున షెడ్లో ఏర్పాటు చేసుకోవాలి. ఫారమ్ చుట్టూ టార్పాలిన్ కవర్లను కప్పి షెడ్ లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 32-35 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలి. షెడ్లో కింద 2 అంగుళాల మేర పొట్టు వేసుకొని దానిపై న్యూస్ పేపర్ వేసుకోవాలి. ఈ చర్యల వల్ల కోడి పిల్లల మరణాలు చాలా వరకు తగ్గుతాయి.


