News September 19, 2024

టెట్ అభ్యర్థులకు ALERT

image

AP: టెట్ అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో నమూనా టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. https://cse.ap.gov.in/లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల OCT 3 నుంచి జరిగే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాసే వీలుంటుంది. ఈ నెల 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి TETకు 4.27లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 7, 2025

రథాల రామారెడ్డికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!

image

కామారెడ్డి(D)లోని రామారెడ్డిని పూర్వం దోమకొండ సంస్థానాధీశుడు రామిరెడ్డి పాలించడం, ఆ ఊరిలో రామాలయం పేరు మీదుగా రామారెడ్డి అనే పేరు వచ్చింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక రథం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక రథం, ఇసన్నపల్లి-రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయంలో ఒక రథం ఉన్నాయి. ఇలా రథాలు ఉన్నందున పూర్వ కాలం నుంచే రథాల రామారెడ్డిగా పూర్వీకులు పిలుస్తున్నారు.

News November 7, 2025

TODAY TOP STORIES

image

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్

News November 7, 2025

మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

image

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.