News July 22, 2024
ఈసెట్ రాసిన వారికి అలర్ట్

TG: బీటెక్, బీఫార్మసీ సెకండ్ ఇయర్ ప్రవేశాల కోసం ఈసెట్ రాసిన వారు రేపటి(ఈ నెల 23)లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని విద్యాకమిషనర్ శ్రీదేవసేన సూచించారు. లేటరల్ ఎంట్రీ కోసం చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు ఆదివారం పూర్తయిందని తెలిపారు.
Similar News
News December 28, 2025
మరో అడ్వెంచర్.. సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి రేపు సబ్‌మెరైన్‌లో ప్రయాణించనున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో వెళ్లనున్న రెండో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు. 2006లో విశాఖపట్నం నుంచి సబ్‌మెరైన్‌లో కలాం ప్రయాణించారు. కాగా గత అక్టోబర్‌లో <<18139196>>రఫేల్ జెట్<<>>లో, 2023లో Sukhoi 30 MKI యుద్ధ విమానంలో ముర్ము విహరించడం తెలిసిందే.
News December 28, 2025
ప్రకృతి సేద్యంలో దూసుకెళ్తున్న మహిళలు

ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడి, ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తిరుపతి జిల్లా తొట్టంబేడు(M) పెద్దకనపర్తికి చెందిన పద్మావతి, భ్రమరాంబ. వీరు సేంద్రియ సేద్యంలో వరి, పసుపు, కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. ఇంటి వద్దే ఘన, ద్రవ జీవామృతం, పంచగవ్య ఇతర ద్రావణాలు తయారుచేసి పంటకు అందించి మంచి దిగుబడులు పొందుతున్నారు. సేద్యంలో ఈ మహిళలు ఎలా రాణిస్తున్నారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 110

ఈరోజు ప్రశ్న: కర్ణుడి అసలు పేరేంటి? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ తర్వాత కర్ణుడిలా ఎందుకు మారింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


