News March 15, 2025
ALERT: ఇవాళే లాస్ట్డేట్ లేదంటే పెనాల్టీ..

FY24-25కి గాను అడ్వాన్స్ ట్యాక్స్ ఆఖరి ఇన్స్టాల్మెంట్ చెల్లించేందుకు MAR 15 చివరి తేదీ. IT చట్టం ప్రకారం ఒక FYలో అంచనా వేసిన పన్ను రూ.10,000 దాటితే ముందస్తుగా చెల్లించాలి. ఉద్యోగులకైతే కంపెనీలు TDS/TCS కత్తిరిస్తాయి. కొందరికి FD, MF, షేర్లు, ఇతర పెట్టుబడుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. వారు JUNE, SEP, DEC, MAR 15లోపు 4 విడతల్లో 15, 45, 75, 100%లోపు పన్ను చెల్లించాలి. లేదంటే 1%/M పెనాల్టీ తప్పదు.
Similar News
News October 19, 2025
లక్ష్మీదేవికి కమలాలు సమర్పిస్తున్నారా?

లక్ష్మీదేవి పూజలో కమలాలు సమర్పించడం అత్యంత శ్రేష్ఠమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం.. క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు, ఆమె చేతిలో కమలాన్ని ధరించి ఉండటం. కమలం శుద్ధి, జ్ఞానం, సంపదకు ప్రతీక. పూజలో ఈ పూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పూజ చేసినట్లు అవుతుంది. తద్వారా ఆమె అనుగ్రహం లభించి, ఇంట ధన, ధాన్య, ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయని విశ్వసిస్తారు.
News October 19, 2025
ముడతలు తొలగించే గాడ్జెట్

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.
News October 19, 2025
IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.