News March 30, 2024

ALERT: ఇంట్లో ఉన్న ఆడవాళ్లే టార్గెట్!

image

భర్త ఆఫీస్‌కు వెళ్లాక, ఇంటి పని చేసుకొని కాసేపు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే ఆడవాళ్లే లక్ష్యంగా సైబర్ మోసాలు మొదలయ్యాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వల వేస్తున్నారు. ఫోన్‌తో ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయవచ్చని, నెలకు ₹20వేల వరకూ సంపాదించుకోవచ్చని ఆశ పెడుతున్నారు. ఇంటి ఖర్చులకైనా అవుతాయని నమ్మి చాలామంది మోసపోతున్నారు. ఇలాగే తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఓ మహిళ రూ.4.63లక్షలు పోగొట్టుకున్నారు. SHARE

Similar News

News January 9, 2026

VIRAL PHOTO: కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న కోహ్లీ!

image

న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనను చూడటానికి వచ్చిన అభిమానులకు ఆయన ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. వారిలో ఓ చిన్నారి అచ్చం యంగ్ కోహ్లీలానే కనిపించాడు. దీంతో ‘యంగ్ కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీనియర్ కోహ్లీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం నుంచి NZతో 3 ODIల సిరీస్ ప్రారంభం కానుంది.

News January 9, 2026

కారులో ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

సంక్రాంతికి కారులో ఊరెళ్లేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జర్నీకి ముందురోజే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. పొద్దున్నే సిటీ అవుట్ స్కట్స్ దాటేయండి. ఫుడ్, ఎక్స్‌ట్రా వాటర్ ఇంటి నుంచే తీసుకెళ్తే మంచిది. దాబాలు, రెస్టారెంట్లలో ఖాళీ ఉండదు. షార్ట్‌కట్లలోనే ట్రాఫిక్ ఎక్కువుండొచ్చు. మెయిన్ రోడ్‌లోనే వెళ్లడం సేఫ్. VJA హైవేలో 6 ఫ్లైఓవర్లు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అటు వెళ్లేవారికి కాస్త ఇబ్బంది కలగొచ్చు.

News January 9, 2026

TET: ఇన్-సర్వీస్ టీచర్లలో 47.82% పాస్

image

AP: ఇన్-సర్వీస్ టీచర్లు రెండేళ్లలోపు టెట్ అర్హత సాధించాలనే సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి రాష్ట్రంలో 31,886 మంది పరీక్షలు రాశారు. అందులో 47.82% మంది పాసైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా 2012లోపు నియామకమైన టీచర్లు రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు 2025 SEPలో తీర్పునిచ్చింది. ఈ టెట్‌లో ఫెయిలైన వారు మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంది. అందులోనూ ఫెయిలైతే ఉద్యోగాలు కోల్పోతారు.