News March 21, 2025

ALERT: ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాతో పాటు అల్లూరి, మన్యం YSR, నంద్యాల, పల్నాడు(D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.

Similar News

News March 23, 2025

ఒంగోలు: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

image

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News March 23, 2025

చీమకుర్తి: లంచం తీసుకుంటూ దొరికిన ప్రిన్సిపల్

image

తన పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే సిబ్బందికి జీతం అందాలంటే ప్రిన్సిపల్‌కి కొంత డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటెండర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి రూ.17,500 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ శిరీష, చీమకురి ఎస్టీ గురుకుల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్‌ని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

News March 23, 2025

కనిగిరి: బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు లోకేశ్.. ఎప్పడంటే.!

image

AP ప్రభుత్వం క్లీన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా.. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ ఏప్రిల్ 2న శంకుస్థాపన చేస్తారు.

error: Content is protected !!