News April 12, 2024
ALERT: రెండు రోజులు వడగాలులు.. జాగ్రత్త
ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Similar News
News November 23, 2024
రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.
News November 23, 2024
లక్కీఛాన్స్ కొట్టిన పి.గన్నవరం వాయిస్ ఆర్టిస్టు
నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, నెట్ ఫ్లెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రచారం కానున్న ఆజాదీకా అమృత కహానియా డాక్యుమెంటరీకి తెలుగు భాష నుంచి వాయిస్ ఆర్టిస్టుగా పి.గన్నవరానికి చెందిన అడ్డగళ్ల రాధాకృష్ణను శుక్రవారం ఎంపిక చేశారు. 8 భాషలకు 8 మందిని బెస్ట్ వాయిస్ ఆర్టిస్టులను ఎంపిక చేయగా తెలుగు భాష నుంచి ఆ అవకాశం రాధాకృష్ణకు దక్కింది. ఈయన గతంలో పలు టీవీల్లో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.
News November 23, 2024
పిఠాపురం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి ఛైర్మన్‌గా కాకినాడ కలెక్టర్ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గ MLAగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే.