News March 22, 2025

ALERT: సాతర్లలో గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం సాతర్లలో గరిష్ఠంగా 39.5, తోతినోనిదొడ్డి, ధరూర్, గద్వాల్, అలంపూర్‌లో 39.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News March 23, 2025

వచ్చే నెలలో ముహూర్తాల జాతర

image

ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి.

News March 23, 2025

వీల్‌ఛైర్‌లో ఉన్నా నాతో క్రికెట్ ఆడిస్తారు: ధోనీ

image

తాను నడవలేని స్థితిలో వీల్‌ఛైర్‌లో ఉన్నా సీఎస్కే ఫ్రాంచైజీ లాక్కెళ్లి క్రికెట్ ఆడిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ అన్నారు. తాను ఆడాలనుకున్నంత కాలం ఆడతానని స్పష్టం చేశారు. CSK ఫ్రాంచైజీ అంటే తనదేననే ఫీల్ వస్తుందన్నారు. కాగా 43 ఏళ్ల ధోనీ ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచులో ఆయన బరిలోకి దిగనున్నారు.

News March 23, 2025

ఆ సామర్థ్యం భారత్ సొంతం: జైశంకర్

image

ఇంధన శక్తి విషయంలో భారత్ విభిన్న విస్తృతమైన బంధాల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అభిప్రాయపడ్డారు. ‘మనది ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మన అవసరాలకు తగిన విధంగా బంధాలుండాలి. ఏకకాలంలో అటు రష్యా ఇటు ఉక్రెయిన్‌తో, అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్‌తో, అటు పశ్చిమ దేశాలు ఇటు దక్షిణార్ధ దేశాలతో, అటు బ్రిక్స్ ఇటు క్వాడ్‌తో చర్చలు జరపగల సామర్థ్యం మన సొంతం’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!