News October 11, 2025
‘కల్కి-2’లో అలియా భట్?

‘కల్కి-2’ మూవీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె తప్పుకోవడంతో ఆమె పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. ఇందులో నటించాల్సిందిగా అలియా భట్‌ను మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పార్ట్-1లో ‘కల్కి’ని గర్భంలో మోస్తున్న ‘సుమతి’ అనే మహిళ పాత్రలో దీపిక కనిపించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఎవరైతే బాగుంటారో కామెంట్ చేయండి.
Similar News
News October 11, 2025
ఈ నెల 24 నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు

TG: స్కూళ్లలో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు మొదటి సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎగ్జామ్ షెడ్యూల్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. 7, 9 తరగతులకు మధ్యాహ్నం, మిగిలిన తరగతులకు ఉదయం పూట పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 3న ఫలితాల ప్రకటన, 15న పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు.
News October 11, 2025
సెహ్వాగ్ సాయం.. U19 జట్టులో పుల్వామా అమరవీరుడి కుమారుడు!

పుల్వామా దాడిలో అమరుడైన విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ హరియాణా U19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. గత ఐదేళ్లుగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన స్కూలులో రాహుల్‌కు ఉచిత విద్య, క్రికెట్ ట్రైనింగ్ అందిస్తున్నారు. U19 టీమ్‌కు రాహుల్ ఎంపికవడం గర్వంగా ఉందని సెహ్వాగ్ తెలిపారు. రాహుల్ గతంలో హరియాణా U14, U16 జట్లకు ఆడాడు. కాగా మరో అమర జవాన్ రామ్ వకీల్ తనయుడు అర్పిత్ కూడా సెహ్వాగ్ స్కూలులోనే చదువుతున్నాడు.
News October 11, 2025
చైనా దిగుమతులపై 100% అదనపు టారిఫ్స్: ట్రంప్

చైనా దిగుమతులపై 100% అదనపు టారిఫ్స్ విధిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పుడున్న టారిఫ్‌లపై అదనంగా 100% విధించారు. అలాగే అన్ని కీలక సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతులపైనా ఆంక్షలు విధిస్తామన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో, దానికి ప్రతీకారంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా అసాధారణ దూకుడును ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.