News December 19, 2024

4 రోజులు ఆ బ్యాంకు సేవలన్నీ బంద్

image

TG: కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం ప్రకారం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన TG బ్రాంచులు విలీనం కానున్నాయి. జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు తమ శాఖపరమైన, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని TGB తెలిపింది. 27వ తేదీలోపు ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవాలని కోరింది.

Similar News

News December 31, 2025

ఇంటి చిట్కాలు మీ కోసం..

image

* చెక్క కుర్చీలు జరిపేటప్పుడు వాటి కాళ్ళకు సాక్సులు వేస్తే నేలపై గీతలు పడకుండా ఉంటాయి.
* కత్తెర, చాకు తుప్పు పడితే వాటిని బ్లాక్ టీలో ఉంచి రెండు మూడు గంటలయ్యాక తీసి పొడి వస్త్రంతో శుభ్రపరచండి.
* ఇంటికి పెయింట్ వేసే ముందు అద్దాలను కిరోసిన్ తో తుడిస్తే మరకలు పడినా సులభంగా వదులుతాయి.
* గాజు గ్లాసులు, సీసాలను మెత్తని ఉప్పుతో శుభ్రపరిస్తే గీతలు పడకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.

News December 31, 2025

APPLY NOW: CDFDలో ఉద్యోగాలు

image

HYDలోని BRIC-సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD)లో 2సైంటిస్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 18వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 27వరకు పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి MSc, MTech, ఎండీ, MVSc, M.Pham, M.Biotech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdfd.org.in/

News December 31, 2025

శివలింగం ధ్వంసం చేసింది హిందువే: SP

image

AP: ద్రాక్షారామం పుణ్యక్షేత్రంలో <<18714825>>శివలింగం<<>> ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఈ పని చేసింది తోటపేటకు చెందిన శీలం శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆలయ సిబ్బందితో అతనికి డ్రైనేజీ విషయంలో గొడవలయ్యాయి. వారిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశాడు. నిందితుడు క్రిస్టియన్ కాదు హిందువే. అతని ఒంటిపై టాటూలు కూడా ఉన్నాయి. అతను వాడిన వస్తువులు, స్కూటీ, దుస్తులు సీజ్ చేశాం’ అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు.