News May 7, 2024
జూన్ 4 తర్వాత బటన్లన్నీ నొక్కుతా: జగన్
AP: ప్రభుత్వ పథకాల నిధులను ఈసీ అడ్డుకోవడంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేశారు. ప్రజలకు మంచి జరగకుండా చేశారు. వీళ్లు పథకాలను అడ్డుకున్నా.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జూన్ 4 మళ్లీ అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే బటన్లన్నీ నొక్కుతా’ అని జగన్ కోరుకొండ రోడ్ షోలో స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2025
EXCLUSIVE: భారత్‌లో చైనా వైరస్ తొలి కేసు!
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్‌నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా పేరంట్స్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (HMPV) పాజిటివ్‌గా తేలింది. దీనిపై సమాచారం అందినట్లు పేర్కొన్న కర్ణాటక ప్రభుత్వం తమ ల్యాబులో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఆ చిన్నారి విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం.
News January 6, 2025
ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్లు?
ప్రశాంత్ నీల్-Jr.NTR సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో మలయాళ స్టార్లు టొవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో NTR కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
News January 6, 2025
కోహ్లీ వద్ద ఇంకా చాలా రన్స్ ఉన్నాయి: పాంటింగ్
సిడ్నీ టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అవగానే అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఒకే తరహాలో పదే పదే పెవిలియన్‌కు చేరుతుండటంపై కోహ్లీ తనపై తానే కోపం చూపించుకున్నాడని చెప్పారు. విరాట్‌కు ఈ సిరీస్ కచ్చితంగా నిరాశ కలిగించిందన్నారు. కానీ అతని వద్ద ఇంకా చాలా పరుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. BGTలో కోహ్లీ 190పరుగులే చేశారు.