News July 6, 2024
చంద్రబాబుపై కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించాలి: హైకోర్టులో పిల్

AP: CM చంద్రబాబు, మంత్రులు, నేతలపై నమోదైన కేసులను CBI, EDకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి IRR, స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్ స్కామ్లపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశాలు లేవని జర్నలిస్ట్ బాలగంగాధర తిలక్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అప్పటి DGP హరీశ్ CID ఆఫీస్ను లాక్ చేశారన్నారు. మొత్తంగా 114 మందిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.
Similar News
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.
News November 20, 2025
శబరిమల భక్తులకు అలర్ట్!

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
News November 20, 2025
నేడు సీబీఐ కోర్టుకు జగన్

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.


