News February 26, 2025
అన్ని దేశాలూ సెంచరీలు.. పాక్ మాత్రం..!

ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (177) శతకం బాదారు. దీంతో పాకిస్థాన్ తప్ప టోర్నీలో పాల్గొన్న అన్ని జట్లు సెంచరీలు నమోదు చేశాయి. 2 మ్యాచులు ఆడినా పాక్ నుంచి ఏ ఒక్కరూ సెంచరీ చేయలేకపోయారు. దీంతో SMలో నెటిజన్లు ఆ జట్టును ట్రోల్స్ చేస్తున్నారు. బంగ్లాపైనైనా పాక్ ఆటగాళ్లు శతకం చేస్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Similar News
News February 27, 2025
Vi, ఎయిర్టెల్ కస్టమర్లను ఆకర్షిస్తున్న BSNL ఆఫర్

లాంగ్టర్మ్ వ్యాలిడిటీతో BSNL అందిస్తున్న ఓ ఆఫర్ వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోందని సమాచారం. 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్, 24GB డేటా, రోజుకు 100 ఫ్రీ SMSలు, ఇతర ఫీచర్లను BSNL రూ.1499కే అందిస్తోంది. 24GB ముగిశాక 40kbps స్పీడుతో ఉచితంగా నెట్ పొందొచ్చు. ప్రస్తుతం వి, ఎయిర్టెల్ 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను రూ.1849కి అందిస్తుండటంతో కస్టమర్లు ఆలోచిస్తున్నారు.
News February 26, 2025
రాజంపేటకు పోసాని కృష్ణమురళి తరలింపు

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటకు తరలిస్తున్నారు. రేపు రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. YCP హయాంలో FDC ఛైర్మన్ హోదాలో పోసాని TDP నేతలను అసభ్యంగా దూషించారని రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్3(5) కింద కేసులు నమోదయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 26, 2025
పోసాని అరెస్ట్ దుర్మార్గం: అంబటి

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ దుర్మార్గమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా పోలీసులు దుందుడుకుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. ‘అసలు పోసానిని ఏ కారణంతో అరెస్ట్ చేశారు. కూటమి సర్కార్ చట్టాలను తుంగలో తొక్కుతోంది. చంద్రబాబు, లోకేశ్ను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.