News October 6, 2024
అందరి కళ్లు అతడిపైనే!

మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్తో తొలి T20 ప్రారంభం కానుంది. అయితే తొలిసారి భారత జట్టుకు ఎంపికైన యంగ్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ మయాంక్ ఆడితే అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. IPLలో లక్నో తరఫున ఆడిన ఈ యువ పేసర్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. కాగా ఇతడికి హర్షిత్రాణా రూపంలో పోటీ ఉంది. ఇద్దరిలో మీ ఓటు ఎవరికి?
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.