News May 2, 2024
అన్నీ ఫ్రీ.. విజన్ లేని మేనిఫెస్టోలు(1/4)

AP: ఎన్నికల వేళ రాష్ట్రంలోని వైసీపీ, కూటములు మేనిఫెస్టోలు ప్రకటించాయి. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, ప్రతి నెలా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నా గుడ్డిగా హామీలు ఇచ్చేశాయి. నువ్వు రూ.10వేలు ఫ్రీగా ఇస్తే నేను రూ.20వేలు ఇస్తా అనేలా వేలంపాట రీతిలో పోటీ పడ్డాయి. రాష్ట్రంపై భారం పడకుండా పథకాలు ఎలా అమలు చేస్తాం? సంపద ఎలా సృష్టిస్తాం? అనే విజన్ ఏ మేనిఫెస్టోలోనూ కనిపించకపోవడం గమనార్హం.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 23, 2025
RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

<
News November 23, 2025
వన్డేలకు కొత్త కెప్టెన్ను ప్రకటించిన టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు భారత జట్టుకు కొత్త కెప్టెన్ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
News November 23, 2025
ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.


