News May 2, 2024
అన్నీ ఫ్రీ.. విజన్ లేని మేనిఫెస్టోలు(2/4)

ఏదైనా పథకం అమలు చేశామంటే దాని ప్రస్తుత లబ్ధి కంటే భవిష్యత్తులో దాని పర్యవసానాలు ఆలోచించడమే విజన్. ఉదాహరణకు విద్యార్థులు బడికి వెళ్తే ఓ పార్టీ రూ.17,000 ఇస్తామంటే.. మరో పార్టీ రూ.20వేలు ఇస్తామని చెప్పింది. అదే ఖర్చు ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, అత్యాధునిక విద్యావిధానాలపై దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుంది. మహిళలు, యువత, రైతుల విషయంలోనూ డబ్బు పంపకాలు కనిపిస్తున్నాయి గానీ విజన్ లేదు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80

ఈరోజు ప్రశ్న: ఉప పాండవులను చంపింది ఎవరు? ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

<


