News May 2, 2024

అన్నీ ఫ్రీ.. విజన్ లేని మేనిఫెస్టోలు(4/4)

image

డబ్బు పంపకం ఓవైపు.. ఉచితాలు మరోవైపు రాష్ట్రాన్ని నాశనం చేస్తాయనేది కాదనలేని సత్యం. కార్మికులు, కూలీలు, రైతులు, చేనేతలు, ఉద్యోగుల ఆదాయం పెరిగేందుకు కృషి చేయకుండా, కరెంటు, గ్యాస్, పెట్రోల్ ఫ్రీగా ఇస్తామంటే పురోభివృద్ధి ఎలా సాధ్యం. కొన్నవాటిని ఉచితంగా ఇస్తే రాష్ట్రంపై డబుల్ భారం. కానీ పార్టీలు ఆ దిశగా ఆలోచన చేసినట్లు కనిపించట్లేదు. ఇలాంటి స్థితిలో ఓటర్లు ఎలా ఆలోచిస్తారో వేచి చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 26, 2024

‘పుష్ప-2’: ఆ పాట డిలీట్

image

‘పుష్ప-2’లోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం T SERIES తెలుగు ఛానల్లో ఈ వీడియో కనిపించడం లేదు. కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన డిసెంబర్ 24న సాయంత్రం ఈ పాటను టీ సిరీస్ విడుదల చేసింది. ఈ సాంగ్ పోలీసులను ఉద్దేశించే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

News December 26, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 73,301 మంది భక్తులు దర్శించుకోగా 26,242 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీకి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరింది.

News December 26, 2024

ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసే హీరోలు వీళ్లే?

image

తెలంగాణ CM రేవంత్‌తో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశం కానున్న సంగతి తెలిసిందే. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది. నిర్మాతల్లో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలుస్తారని సమాచారం.