News October 4, 2025

24 గేట్లు ఎత్తి సాగర్ నీటి విడుదల

image

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో సాగర్‌ 24 ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. 590 ఫీట్ల సామర్థ్యం కలిగిన జలాశయంలో నీటి మట్టం 587కు చేరుకుంది. కాలువలకూ భారీగా నీటిని వదులుతున్నందున నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని ప్రజలను ఇరిగేషన్ శాఖ అప్రమత్తం చేసింది. నీటి ఉధృతి వల్ల కాలువల్లో ఈత కొట్టవద్దని సూచించింది.

Similar News

News October 4, 2025

మీకు తెలుసా? మెమరీలో మహిళలే బెస్ట్

image

పురుషులతో పోలిస్తే మహిళల్లో మెమరీ స్కిల్స్ అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఏవైనా ఘటనలనే కాకుండా కొత్త ముఖాలు, లిస్టులోని వస్తువులు, మాటలను కూడా ఎక్కువకాలం గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్ ఉమెన్స్‌లో ఈ శక్తి అధికంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మెమరీ స్కిల్ క్రమంగా తగ్గినప్పటికీ మగాళ్ల కంటే బెటర్‌గా ఉంటుంది.

News October 4, 2025

షమీ కెరీర్ ముగిసినట్లేనా?

image

ఇండియన్ పేసర్ షమీ ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికవ్వకపోవడంతో అతడి కెరీర్ ముగిసిందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా గాయాలు కంబ్యాక్‌ను అడ్డుకుంటున్నాయి. ఇప్పుడున్న పోటీకి తోడు 6 నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం షమీ కెరీర్‌ ప్రమాదంలో పడేలా ఉంది. పైగా వ్యక్తిగత సమస్యలు కూడా అతడు తిరిగి పుంజుకోవడానికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. షమీ 64 టెస్టులు, 108 వన్డేలు, 25 T20లు ఆడారు.

News October 4, 2025

APPLY NOW: NITCలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్‌ 12 ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఆయా విభాగాల్లో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. వెబ్‌సైట్: https://nitc.ac.in/