News March 14, 2025
ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ మరాఠీలోనే: ఫడణవీస్

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(MPSC) పరీక్షలన్నింటినీ మరాఠీలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర CM ఫడణవీస్ ప్రకటించారు. ‘ఇంజినీరింగ్ కోర్సులు సహా అన్ని సాంకేతిక సబ్జెక్టులూ మరాఠీలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. MPSC పరీక్షల మరాఠీ నిర్వహణ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం’ అని శాసనమండలిలో తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడలేని విద్యార్థుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News March 31, 2026
ఈసారీ సత్తా చాటుతారా?

ఈ ఐపీఎల్ సీజన్‌లో GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్, PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల ప్రదర్శనపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 175 స్ట్రైక్ రేటుతో అయ్యర్ లాస్ట్ సీజన్‌లో 604 రన్స్ చేయగా గిల్ 155 స్ట్రైక్ రేటుతో 650 పరుగులు చేశారు. ఇటీవల T20WCలో చోటు దక్కకపోవడంతో ఈ సీజన్‌లో రాణించి జట్టులో చోటు దక్కించుకోవాలని గిల్, అయ్యర్‌లు ఆశిస్తున్నారు.
News March 31, 2026
పోలవరంపై ‘వార్’ ఎఫెక్ట్

AP: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పోలవరం ప్రాజెక్టుపైనా పడింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కోసం పక్కనే ఉన్న కొండల నుంచి రాయిని తొలిచేందుకు ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది. ఇటీవల బ్లాస్టులకు వాడటంతో అమ్మోనియం నైట్రేట్ కొరత ఏర్పడింది. దీంతో 30శాతం బ్లాస్టింగ్ పనులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఇక డయాఫ్రమ్ వాల్ పనులు అనుకున్న గడువులోగానే పూర్తవుతున్నాయని వెల్లడించారు.
News March 31, 2026
నా కెరీర్‌లోనే హాటెస్ట్ క్యారెక్టర్: కృతి సనన్

కాక్‌టైల్-2లో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని కృతి సనన్ తెలిపారు. ‘నా పర్సనాలిటీలో నాకే తెలియని యాంగిల్‌ను డైరెక్టర్ అదజానియా చూపించారు. బహుశా నా కెరీర్‌లో హాటెస్ట్ క్యారెక్టర్ ఇదే’ అని వివరించారు. కాక్‌టైల్-2, కాక్‌టైల్ స్టోరీలైన్స్ వేర్వేరని తెలిపారు. వైబ్ మాత్రం సేమ్ ఉంటుందన్నారు. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయితో స్టోరీ నడుస్తుందని చెప్పారు. రష్మిక కూడా నటిస్తున్న ఈ మూవీ జూన్ 19న రిలీజ్ కానుంది.


