News November 12, 2024
All in Red: అన్ని రంగాలు నష్టాల్లోనే

Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగళవారం నష్టపోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services సహా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 5వ తేదీన 23,900 పరిధిలో Nifty సపోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వడంతో తదుపరి ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 4, 2025
SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ను భారత్కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.


