News April 14, 2024
మోదీ గ్యారంటీలన్నీ తప్పుడు హామీలే: కాంగ్రెస్

పీఎం మోదీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. మోదీ గ్యారంటీలన్నీ తప్పుడు హామీలేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మండిపడ్డారు. ‘ఉద్యోగ కల్పన, రైతుల ఆదాయం రెట్టింపు, ధరల పెరుగుదల కట్టడి వంటి గత హామీలన్నీ అలాగే ఉండిపోయాయి. వీటన్నింటినీ ఇప్పుడు 2047కు వాయిదా వేస్తున్నారు. గత పదేళ్లలో దేశం కోసం బీజేపీ చేసిందేమీ లేదు. ప్రజలు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు’ అని విమర్శించారు.
Similar News
News March 24, 2026
VJA: రూ.44కోట్లతో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు

రాష్ట్రంలో రూ.44 కోట్లతో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. 2 నెలల్లోగా ఈ కేంద్రాలను ప్రారంభించడానికి కార్యచరణ చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వీటి ఏర్పాటుతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువకానున్నాయన్నారు.
News March 24, 2026
ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.
News March 24, 2026
మన దగ్గర ఎన్నిరోజులకు సరిపడా ఇంధనం ఉందంటే..

దేశంలో దిగుమతులకు అంతరాయం ఏర్పడితే మన క్రూడాయిల్ రిజర్వులు(100% కెపాసిటీ) 9.5 రోజులకే సరిపోతాయని కేంద్రం వెల్లడించింది. వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు(SPR)ల్లో 33.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆయిల్ నిల్వ ఉందని తెలిపింది. APలోని విశాఖ, KAలోని మంగళూరు, పాదూర్‌లో ఈ రిజర్వులు ఉన్నట్లు వివరించింది. వీటి మొత్తం కెపాసిటీ 53.3L MT అని పేర్కొంది. RTI ద్వారా India Today అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.


