News December 4, 2024
వీరంతా దివ్యాంగులే.. కానీ సాధించారు! (1/2)

లూయీ బ్రెయిలీ: అంధుడైన బ్రెయిలీ టీనేజర్‌గా ఉన్నప్పుడు బ్రెయిలీ లిపిని రూపొందించారు. నేడు కళ్లులేనివారు కూడా చదువుకునేందుకు ఉపకరిస్తోంది.
స్టీఫెన్ హాకింగ్: ALS వ్యాధి వలన 21వ ఏట నుంచి కుర్చీకే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్, ప్రపంచం గర్వించే భౌతిక శాస్త్రవేత్త అయ్యారు.
హెలెన్ కెల్లర్: 19 నెలల వయసులో వ్యాధి కారణంగా మూగ, చెవిటిగా మారిన కెల్లర్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన పలు పుస్తకాల్ని రాశారు.
Similar News
News December 15, 2025
వలిగొండలో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.. గెలిచిందెవరంటే?

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకట పాపిరెడ్డి ప్రత్యర్థి BRS బలపరిచిన పలుసం రమేశ్ గౌడ్‌పై 472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచాలు, మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 7,212 ఓట్లు ఉండగా కాంగ్రెస్, BRS మధ్య నెక్ టూ నెక్ ఫైట్ సాగింది.
News December 15, 2025
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.
News December 15, 2025
మూడు దేశాల పర్యటనకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.


