News December 4, 2024
వీరంతా దివ్యాంగులే.. కానీ సాధించారు! (2/2)

సూర్దాస్: 16వ శతాబ్దానికి చెందిన సూర్దాస్కు కళ్లు కనిపించేవి కాదు. అయినా కృష్ణుడి కోసం వేలాది కవితల్ని రాశారు.
రూజ్వెల్ట్: పోలియోతో నడుం కింది భాగం చచ్చుబడిపోయినా పట్టుదలతో అమెరికాకు 4సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.
ఫ్రీడా కాహ్లో: మెక్సికోకు చెందిన ఫ్రీడా కాహ్లో పోలియో, బస్సు ప్రమాదం కారణంగా దివ్యాంగురాలయ్యారు. అయినప్పటికీ తనను తాను దిగ్గజ పెయింటర్‌గా తీర్చిదిద్దుకున్నారు.
Similar News
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు.. 39 తీర్మానాలు ఆమోదం

మెదక్ పట్టణంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశపెట్టిన 39 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2025
రాయ్‌బరేలిలో ‘ఓట్ చోరీ’తో గెలిచిన ఇందిరా గాంధీ: బీజేపీ MP

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె విమర్శించారు. రాయ్‌బరేలిలో ఇందిరా గాంధీ ‘ఓట్ చోరీ’తోనే గెలిచారని ఆరోపించారు. తాను RSS నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోక్‌సభలో ఎలక్షన్ రిఫామ్స్‌పై జరుగుతున్న చర్చలో RSS, ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను దూబె తిప్పికొట్టారు.
News December 9, 2025
తొలి టీ20: టాస్ ఓడిన భారత్

కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి


