News October 25, 2024
అవన్నీ జగన్ సొంత ఆస్తులు కాదు: షర్మిల

AP: జగన్‌తో ఆస్తుల గొడవలపై YS షర్మిల 3 పేజీల లేఖను విడుదల చేశారు. ‘స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబానివే. ఆయన గార్డియన్ మాత్రమే. 2019లో సీఎం అయ్యాక విడిపోదామా? అని జగన్ ప్రతిపాదన పెట్టారు. సాక్షి, భారతి సిమెంట్స్‌లో 60% వాటా తీసుకుంటానంటే, ఒప్పుకోలేదని మాపై కేసు వేశారు. నాన్న పేరు చెడిపోతుందని మౌనంగా ఉన్నాం. కొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చటం ఎంత అవమానం?’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
నెల్లూరు కలెక్టర్ చొరవతో నిమ్మ రైతులకు ఊరట

నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతులను ఆదుకునేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక చొరవ చూపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి జిల్లాలోని నిమ్మ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే నిమ్మను ఆయా జిల్లాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిమాండ్ ఉన్న ఇతర జిల్లాలతో కూడా సంప్రదించాలని అధికారులకు సూచించారు.
News December 11, 2025
టాప్ స్టోరీస్

* ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: CM CBN
* ఉస్మానియాలో పర్యటించిన CM రేవంత్.. అభివృద్ధి పనులకు రూ.1000Cr మంజూరు
* తెలంగాణలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
* ఓట్ చోరీపై LSలో అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం
* ఇండిగో సంక్షోభం వేళ విమాన టికెట్ రేట్లను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఢిల్లీ HC ఆగ్రహం
News December 11, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలా? మీరేమంటారు?

తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సీబీఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చామని విద్యాశాఖ చెబుతోంది. అయితే దీన్ని టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్నిరోజుల గ్యాప్ వల్ల స్టూడెంట్స్ మరింత ఒత్తిడికి గురవుతారని, షెడ్యూల్లో లాజిక్ లేదని అంటోంది. విద్యార్థుల పేరెంట్స్‌గా మీ అభిప్రాయం ఏంటి?


